Bellampalli: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపు.. సభ నుండి బిఆర్ఎస్ కౌన్సిలర్ల
Bellampalli: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 108 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు లక్కీ డ్రా నిర్వహించారు.
Bellampalli: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపు.. సభ నుండి బిఆర్ఎస్ కౌన్సిలర్ల
బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా లోని బెల్లంపల్లి పట్టణంలోని పద్మశాలి భవన్ లో బెల్లంపల్లి పట్టణంలో నిర్మించిన 160 ఇండ్లకు గాను 108 ఇళ్లకు లక్కీ డ్రా ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసిన రెవెన్యూ అధికారులు మరియు మున్సిపల్ చైర్పర్సన్ దావ స్వాతి రమేష్ బాబు బెల్లంపల్లి పట్టణంలో డబుల్ బెడ్రూం ఇళ్ల లక్కీ డ్రా
బెల్లంపల్లి పట్టణంలో ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న నిరుపేద కుటుంబాల సొంతింటి కల నెరవేరబోతోంది. డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులో భాగంగా అధికారులు లక్కీ డ్రా ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించారు. ప్రజల సమక్షంలో, అధికారుల పర్యవేక్షణలో నిర్వహించిన ఈ డ్రా కార్యక్రమంలో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేశారు
ఈ సందర్భంగా పట్టణ ప్రజలు భారీగా హాజరై ఆసక్తిగా లక్కీ డ్రాను వీక్షించారు. ఎంపికైన కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. నిజమైన అర్హులకు ఇళ్లు అందేలా పూర్తి పారదర్శకతతో ప్రక్రియ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు
పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని స్థానిక ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. బెల్లంపల్లి పట్టణంలో డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీతో అనేక కుటుంబాల్లో కొత్త ఆశలు చిగురించాయి.
సభ నుండి వాక్ అవుట్ చేసిన బి ఆర్ఎస్ కౌన్సిలర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో జాబితాలో 108 లబ్ధిదారులు ఉండగా అందులో ఇదివరకే ఇండ్లు ఉన్న వారికే వారికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయిస్తున్నారని బిఆర్ఎస్ కౌన్సిలర్లు కొంతమంది ఆరోపిస్తూ సభ నుండి వాకౌట్ చేశారు




