Dasturabad: అన్నదాత ఆవేదన..మా సొమ్ము ఇతరుల ఖాతాల్లోకి ఎలా మళ్లిస్తారు?

Dasturabad: నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను డీఆర్‌డీఓ పీడీ విజయలక్ష్మి తనిఖీ చేశారు.

RAKESH N, KHANAPUR
Published on: 5 May 2026 12:49 PM IST
Dasturabad
X

Dasturabad: అన్నదాత ఆవేదన..మా సొమ్ము ఇతరుల ఖాతాల్లోకి ఎలా మళ్లిస్తారు?

దస్తురాబాద్: నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలోని దస్తురాబాద్, రాంపూర్ గ్రామాల ఐకెపి కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు డిఆర్డిఓ పీడి విజయలక్ష్మి. ఈ సందర్భంగా రైతులు పలు సమస్యలు డిఆర్డిఓ దృష్టికి తీసుకెళ్లారు. ధాన్యం కల్లాల్లో ఆరబోసి 20 రోజులు అయిందని, కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై నేటికి పది రోజులు గడిచినా ఇంకా ధాన్యం కొనుగోలు చేయట్లేదని, సెంటర్ వద్ద సిబ్బంది అందుబాటులో ఉండడం లేదని, రైతులకు సహకరించట్లేదని,సిబ్బంది ని మార్చాలని తమ ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో బోనస్ డబ్బులు IKP సిబ్బంది రైతుల ఖాతాలకు కాకుండా ఇతరుల ఖాతాలకు మళ్ళించారని, కొనుగోలు చేసిన తర్వాత రసీదులు ఇవ్వకుండా, ధాన్యం మిల్లులకు తరలించిన తర్వాత తప్ప, తాలు పేరిట అదనంగా 3,4 కిలోలు కటింగ్ చేసి రైతులను నిలువునా ముంచారని ఆగ్రహించారు. రెండు కాంటాలు పెట్టి, హమాలీల సంఖ్యను పెంచి త్వరగా కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

RAKESH N, KHANAPUR

RAKESH N, KHANAPUR

Next Story