Kagaznagar: కాగజ్‌నగర్‌లో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం..

Kagaznagar: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు.

LALITH KUMAR, SIRPUR
Published on: 7 Jun 2026 9:40 AM IST
Kagaznagar
X

Kagaznagar: కాగజ్‌నగర్‌లో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం..

కాగజ్‌నగర్: కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు పోలీసులు. ఈకార్యక్రమంలో సరైన పత్రాలు లేని 45 ద్విచక్పార వాహనాలు, రెండు ఆటోలు, ఒక ట్రాలీకి జరిమానా విధించారు.

ఈసందర్భంగా కాగజ్ నగర్ డీఎస్పీ వహీదుద్దీన్ మాట్లాడుతూ.. ప్రజల కోసం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. యువత మత్తు పదార్థాలకు అలవాటు కాకూడదని తెలిపారు. వాహనాలపై ప్రయాణాలు చేస్తున్నప్పుడు హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు.

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. పౌరులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తిన పోలీస్ శాఖ అందుబాటులో ఉంటుందని స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాగజ్ నగర్ సిఐ ప్రేమ్ కుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

LALITH KUMAR, SIRPUR

LALITH KUMAR, SIRPUR

Next Story