Adilabad: ఎల్ నీనో ఎఫెక్ట్.. ఎండు దశకు చేరుకుంటున్న ఖరీఫ్ పంటలు!

Adilabad: వర్షాభావ పరిస్థితులతో ఆదిలాబాద్ జిల్లాలో ఎండు దశకు చేరుకుంటున్న పంటలు. పెనుగంగా నది నీటిని మోటార్ల ద్వారా తరలిస్తూ కాపాడుకుంటున్న రైతులు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 7 Oct 2026 12:37 PM IST
Adilabad
X

Adilabad: ఎల్ నీనో ఎఫెక్ట్.. ఎండు దశకు చేరుకుంటున్న ఖరీఫ్ పంటలు!

Adilabad: వర్షాభావ పరిస్థితులు ఖరీఫ్ పంటలపై తీవ్రప్రభాతం చూపుతోంది. గత నెల రోజుల నుంచి చినుకు జాడ లేక పంట పెరుగుదల నిలిచిపోయి ఎండు దశకు చేరుకుంటున్న అదిలాబాద్ జిల్లాలోని భీంపూర్, తాంసి, బోరాజ్, జైనథ్, బేల మండలాల పెనుగంగా నది తీరా పరివాహక గ్రామాల రైతులు కరెంటు మోటర్లు, ఆయిల్ ఇంజన్ల ద్వారా నీటిని పంట పొలాలకు తరలిస్తూ పంటలకు జీవం పోస్తున్నారు.

గతంలో ఇలాంటి విపత్కర పరిస్థితి ఎన్నడూ చూడలేదని, ఎకరాకు 50 వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టి నష్టపోతున్నామని, అయితే సాగునీటి వసతి ఉన్న రైతులు నీటి తడులు అందిస్తుండగా, సాగు నీటి వసతి లేని రైతులు, చెరువులు కుంటలు వాగులు వంకల వద్ద మోటార్లు బిగించుకొని నీటిని తరలిస్తూ పంటలకు నీటి తడులు అందిస్తున్నారు.

భీంపూర్ మండలంలోని సరిహద్దు పెనుగంగా నది గ్రామాల రైతులు వందల సంఖ్యలో మోటర్లు పెట్టి పంటలకు జీవం పోస్తున్నారు. దిగుబడులపై ఇప్పటికే ఆశలు కోల్పోగా, కనీసం నీటి తడులు అందిస్తే నష్టాల నుంచి కొంత బయటపడవచ్చు అని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.