Adilabad: మంత్రి పదవి వస్తుందనే కుట్రతోనే నాకు టికెట్ రాలేదు బాపురావు!
Adilabad: తనకు మంత్రి పదవి రాకుండా కుట్ర పన్ని బీఆర్ఎస్ టికెట్ అడ్డుకున్నారని, వచ్చే నెలలో ఇంద్రవెల్లిలో తెలంగాణ రాష్ట్ర సేన భారీ సభ ఉంటుందని బాపురావు తెలిపారు.
Adilabad: మంత్రి పదవి వస్తుందనే కుట్రతోనే నాకు టికెట్ రాలేదు బాపురావు!
Adilabad: తాను గెలిస్తే ఎక్కడ తనకి మంత్రి పదవి వస్తుందో అని కుట్రతో కొంతమంది తనకు బిఆర్ఎస్ టికెట్ రాకుండా అడ్డుకున్నారని తెలంగాణ రాష్ట్ర సేన జిల్లా కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఆరోపించారు. మంగళవారం ఆదిలాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.
కల్వకుంట్ల కవిత అభ్యర్థన మేరకే టిఆర్ఎస్ లో చేరినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వం హయాంలో కొంతమంది బడా నేతలు రాష్ట్రాన్ని దోచుకున్నారని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దోచుకుంటున్నదని ఆరోపించారు. సామాజిక తెలంగాణ కోసమే కవిత పోరాడుతున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రాన్ని దోచుకుంటున్న వారిపై ఆమె పోరాటాలు చేస్తున్నారన్నారు. వచ్చే నెలలో ఇంద్రవెల్లిలో తెలంగాణ రాష్ట్ర సేన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని ఆ సమావేశానికి కల్వకుంట్ల కవిత హాజరవుతారని పేర్కొన్నారు.




