Adilabad: ఎయిర్‌పోర్ట్‌కు నిధుల కేటాయింపుపై మాజీ ఎంపీ సోయం హర్షం

Adilabad: ఎయిర్‌పోర్ట్‌కు నిధులు కేటాయించడంపై మాజీ ఎంపీ సోయం బాపూరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 27 July 2026 1:19 PM IST
Adilabad
X

Adilabad: ఎయిర్‌పోర్ట్‌కు నిధుల కేటాయింపుపై మాజీ ఎంపీ సోయం హర్షం

ఆదిలాబాద్: ఎయిర్పోర్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం హర్షనీయమని మాజీ ఎంపీ సోయం బాపూరావు అన్నారు.

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

అంతకుముందు పార్టీ ఆఫీసు కాంగ్రెస్ పార్టీ శ్రేణులుఎదుట సంబరాలు జరుపుకున్నారు.

ఎయిర్పోర్ట్ కోసం నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

తాను ఎంపీగా ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ కోసం బీజం పడిందని మాజీ ఎంపీ పేర్కొన్నారు.

కానీ నేడు కొంతమంది వారే చేసినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

ఎయిర్పోర్ట్ ఏర్పాటు అయితే జిల్లా మరింత అభివృద్ధి చెందుతుందని, స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story