Nirmal: నిర్మల్ జిల్లాలో భక్తులను ఆకట్టుకుంటున్న కర్ర గణపతి!
Nirmal: నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్ గ్రామంలో ప్రత్యేకంగా కొలువుదీరిన 'కర్ర గణపతి'.. ముడుపులు కడితే కోర్కెలు తీర్చే మోక్ష గణపతి.
Nirmal: నిర్మల్ జిల్లాలో భక్తులను ఆకట్టుకుంటున్న కర్ర గణపతి!
Nirmal: లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్ గ్రామంలో ఊరంతా ఒక్కటై భక్తిశ్రద్ధలతో కొలుస్తున్న కర్ర గణపతి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. ఈ గణపతిని దర్శించుకునేందుకు దూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
11 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో గ్రామస్థులంతా ఒక్కతాటిపైకి వచ్చి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
మోక్ష గణపతిగా పేరొందిన ఈ స్వామికి ముడుపులు కడితే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. దీంతో మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు.




