Mukhra: కేటీఆర్ జన్మదిన వేడుకలు పొలాల్లో పుష్పాభిషేకం చేసిన రైతులు!
Mukhra: బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ నాయకత్వంలో ఆదిలాబాద్ జిల్లా ముఖరా 'కే' గ్రామంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందస్తు జన్మదిన వేడుకలు జరిగాయి.
Mukhra: కేటీఆర్ జన్మదిన వేడుకలు పొలాల్లో పుష్పాభిషేకం చేసిన రైతులు!
కేటీఆర్ జన్మదిన వేడుకలు జరిపిన ముఖరా 'కే' రైతులు: కేసీఆర్ పాలనే తెలంగాణకు శ్రీరామరక్ష
ఇచ్చోడ: బోథ్ శాసనసభ్యులు అనిల్ జాధవ్ నాయకత్వంలో ఆదిలాబాద్ జిల్లా ముఖరా 'కే' గ్రామంలో రైతులు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను ముందస్తుగా జరుపుకున్నారు.
తమ పంట పొలాల్లో కేటీఆర్ ఫోటోకు పుష్పాభిషేకం చేసిన రైతులు, ఆయన ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఐటీ రంగంలో తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిపిన ఘనత కేటీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ... తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీరు అందించి రైతులను రాజుగా చూశారని పేర్కొన్నారు.
ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రైతు భరోసా ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి నెలకొందని, ఎరువుల కోసం యాప్‌లు పెట్టి యూరియా దొరకకుండా రైతులను ఆగం చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణకు కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష అని, మళ్లీ ఆయన వస్తేనే రైతులకు స్వర్ణయుగం తిరిగి వస్తుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్, రైతులు తిరుపతి, విట్టల్, దత్త, ప్రహ్లాద్ తదితరులు పాల్గొన్నారు.




