Adilabad: రైతులపై విరుచుకుపడ్డ అశోక్ రెడ్డి.. జైనథ్ మార్కెట్ యార్డు

Adilabad: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి తీరుపై రైతులు మండిపడుతున్నారు.

ANNOJULA SRINIVAS  RAO
Published on: 12 May 2026 4:38 PM IST
Adilabad
X

Adilabad: రైతులపై విరుచుకుపడ్డ అశోక్ రెడ్డి.. జైనథ్ మార్కెట్ యార్డు

ఆదిలాబాద్: జొన్నల కొనుగోలు పై జరుగుతున్న జాప్యంపై మార్కెట్ కమిటీ చైర్మన్ వివరణ కోరెందుకు వెళ్లిన రైతులను సదరు మార్కెట్ కమిటీ చైర్మన్ బూతులు తిడుతూ అమాయక రైతులపై మండిపడ్డారు అదిలాబాద్ జిల్లా జైనథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి.. మార్కెట్ యార్డులో గత కొన్ని రోజుల నుంచి తెల్ల జొన్న పంట కొనుగోలు ప్రారంభించగా, వివిధ గ్రామాల రైతులు షెడ్యూల్ ప్రకారం మార్కెట్ యార్డ్ కు జొన్న పంటను తీసుకొచ్చారు.

రోజులు గడుస్తున్న కొనుగోలు ముందుకు సాగడం లేదని సంబంధిత మార్కెట్ కమిటీ చైర్మన్ కు వివరించేందుకు వెళ్లగా వారితో దురుసుగా ప్రవర్తించడంతోపాటు, బూతు మాటలతో తిట్ల పురాణం వినిపించడంతో రైతులు మండిపడుతున్నారు. ఇప్పటికే మార్కెట్ కమిటీ చైర్మన్ వ్యవహార శైలి సరిగ్గా లేకపోవడంతో సంతోష్ అనే మార్కెట్ డైరెక్టర్ తన పదవికి రాజీనామా చేయగా, గత సంవత్సరం కూడా హమాలీల గుత్తే దారును బెదిరింపులకు పాల్పడి డబ్బులు వసూలు విషయంలో సోషల్ మీడియాలో అప్పట్లో వైరల్ గా మారింది.. మొత్తంగా రైతు పండగ నిలవాల్సిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వ్యవహార శైలిపై రైతుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ANNOJULA SRINIVAS  RAO

ANNOJULA SRINIVAS RAO

Next Story