Adilabad: ఎకరానికి రూ. 6 కోట్లు, ఇంటికో ఉద్యోగం ఇస్తేనే ఎయిర్‌పోర్ట్ ల్యాండ్!

Adilabad: ఆదిలాబాద్ నిశాన్ఘాట్‌లో ఎయిర్‌పోర్ట్ ల్యాండ్ సర్వేను రైతులు అడ్డుకున్నారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 4 Aug 2026 4:08 PM IST
Adilabad
X

Adilabad: ఎకరానికి రూ. 6 కోట్లు, ఇంటికో ఉద్యోగం ఇస్తేనే ఎయిర్‌పోర్ట్ ల్యాండ్!

ఆదిలాబాద్: ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం చేపట్టిన సర్వేను అడ్డుకున్నారు రైతులు.. ఆదిలాబాద్ లోని నిశాన్ఘాట్ శివారులో సర్వే అధికారులు ల్యాండ్ సర్వే చేపడుతుండగా పరిహారం చెల్లింపు పై ప్రకటన చేసిన అనంతరం సర్వే నిర్వహించాలని, అదేవిధంగా తమకు అనేక సందేహాలు ఉన్నాయని రైతులు అధికారులకు తెలియజేశారు.

విషయం తెలుసుకున్న ఆర్డీవో జగదీశ్వర్ రైతుల వద్దకు చేరుకొని వారి డిమాండ్స్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. వ్యవసాయంపై తమ జీవనాధారం ఉందని పేర్కొన్నారు.

జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న నిషాన్ఘాట్ భూములకు ఎకరానికి రూ:6కోట్లు ఇవ్వాలని అదేవిధంగా ఇంటికొక ఉద్యోగ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు... ఈ సందర్భంగా ఆర్డీవో రైతుల డిమాండ్లను కచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని, ఇది కేవలం సర్వే మాత్రమేనని ఆర్డిఓ వివరించారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story