Adilabad: కన్న కూతురును హతమార్చిన తండ్రి!
Adilabad: ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం ఉమ్రి గ్రామంలో దారుణం. వేరొకరిని ప్రేమించిందని నిశ్చితార్థానికి ముందు రోజు కన్న కూతురుని గొంతు నులిమి హత్య చేసిన తండ్రి.
Adilabad: కన్న కూతురును హతమార్చిన తండ్రి!
Adilabad: అదిలాబాద్ జిల్లా నార్నూరు మండలంలో కన్న కూతురును తండ్రి హతమార్చిన ఘటన విషాదం చోటుచేసుకుంది. మరొకరిని ప్రేమించిందని కుమార్తెను నిశ్చితార్థానికి ముందు రోజు తండ్రి హత్య చేశాడు. అనంతరం ఆమె ఆత్మ హత్య చేసుకున్నట్లు చిత్రీకరించబోయాడు.
ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం ఉమ్రి గ్రామంలో చోటుచేసుకుంది. సీఐ గురు స్వామి తెలిపిన వివరాల ప్రకారం సుమన్ బాయి-కైలాస్ ఆడే దంప తులు. నిన్నటి రోజు అంటే బుధవారం వీరి కుమార్తె కల్యాణి(19) నిశ్చితార్థం చేయాలని నిర్ణ యించారు. ఈ నెల 23న సాయంత్రం తాను మేనమామ కుమారుడి ప్రేమిస్తున్నానని తల్లిదండ్రులకు యువతి చెప్పింది. దీంతో వాగ్వాదం జరిగింది.
ఆగ్రహానికి గురైన తండ్రి 24వ తేదీన గొంతు నులిమి హత చేశాడు. మెడకు చున్నీ కట్టుకుని కుమార్తె ఆత్మహత్య చేసుకుందని గ్రామస్థులకు చెప్పాడు. గ్రామస్థుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి విచారించారు. వారి విచారణలో హత్యచేసినట్లు తండ్రి ఒప్పుకొన్నాడని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.




