Khanapur: మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్‌పై ఖానాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు!
Khanapur: ఖానాపూర్ పోలీస్ స్టేషన్‌లో మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్‌పై కేసు నమోదు. రూ.40.96 కోట్ల విలువైన పీడీఎస్ (PDS) బియ్యం మాయంపై సివిల్ సప్లైస్ అధికారుల ఫిర్యాదు.
Khanapur: మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్‌పై ఖానాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు!
Khanapur: మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్‌పై క్రైమ్ నెంబర్ 165/2026, సెక్షన్ 316(2) 316(5), 318(4) BNS మరియు EC చట్టంలోని సెక్షన్ 7కింద ఖానాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు రూ. 40,96,96,834 విలువైన పీడీఎస్ (PDS) బియ్యం మాయం.సివిల్ సప్లైస్ ఫిర్యాదు.
సత్తెనపల్లి ఏఆర్ఎస్ (ARS) రైస్ మిల్లుపై కేసు పెట్టిన అధికారులు.నాలుగేళ్ల అక్రమాలు: 2022 నుంచి 2025 వరకు సీఎంఆర్ (CMR) కింద వచ్చిన బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించని వైనం.
పోలీస్ దర్యాప్తు ఎఫ్‌సిఐ (FCI) ద్వారా సేకరించిన వరి ధాన్యం మిల్లింగ్ అక్రమాలపై విచారణ వేగవంతం.నిర్మల్ జిల్లా //ఖానాపూర్ పరిధిలోని సత్తెనపల్లి ఏఆర్ఎస్ రైస్ మిల్‌కు సంబంధించి సివిల్ సప్లైస్ అధికారులు ఈ సంచలన చర్య తీసుకున్నారు. 2022, 2023, 2024, అలాగే 2025 సంవత్సరాల్లో ఎఫ్‌సిఐ (FCI) ద్వారా ప్రభుత్వం సేకరించిన వరి ధాన్యాన్ని సివిల్ సప్లైస్ విభాగం ఈ మిల్లుకు సీఎంఆర్ (Custom Milling Rice) కింద సరఫరా చేసింది.
నిబంధనల ప్రకారం మిల్లింగ్ చేసిన అనంతరం ప్రభుత్వానికి తిరిగి అప్పగించాల్సిన రూ. 40,96,96,834. విలువైన పీడీఎస్ బియ్యాన్ని మిల్లు యాజమాన్యం అప్పగించలేదు.
దీంతో ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేశారంటూ సివిల్ సప్లైస్ అధికారులు ఖానాపూర్ పోలీస్ స్టేషన్‌లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ మిల్లు మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్‌కు సంబంధించినది కావడంతో ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు."




