Kagaznagar: కాగజ్‌నగర్‌లో అక్రమ ఇసుక రవాణా - ఐదు ట్రాక్టర్లు సీజ్!

Kagaznagar: కొమురంభీం జిల్లా కాగజ్‌నగర్ మండలంలో అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న 5 ట్రాక్టర్లను సీజ్ చేసిన రెవెన్యూ, మైన్స్ అధికారులు. పోలీస్ స్టేషన్‌కు తరలింపు.

LALITH KUMAR, SIRPUR
Published on: 29 Sept 2026 12:30 PM IST
Kagaznagar
X

Kagaznagar: కాగజ్‌నగర్‌లో అక్రమ ఇసుక రవాణా - ఐదు ట్రాక్టర్లు సీజ్!

Kagaznagar: కొమరం భీం జిల్లా కాగజ్‌నగర్ తహసీల్దార్ ఆదేశాల మేరకు కాగజ్‌నగర్ మండలంలోని గువ్వలగూడ (జంబుగ) వాగు నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న ఐదు ఇసుక ట్రాక్టర్లను రెవెన్యూ శాఖ, మైన్స్ శాఖ అధికారులు సీజ్ చేసి, తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం ఈజ్‌గావ్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించడం జరిగింది.

సీజ్ చేసిన ఐదు ట్రాక్టర్ల యజమానులు మరియు సంబంధిత వ్యక్తులపై నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. ఈ తనిఖీల్లో గిర్దావర్లు గోపాల్, దిలీప్, GPOలు శ్రీనివాస్, ఖాదర్లతో పాటు మైన్స్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

అదేవిధంగా, కాగజ్‌నగర్ మండల పరిధిలో ఎవరైనా సరైన అనుమతులు లేకుండా ఇసుక లేదా మట్టిని తరలించినట్లయితే, వారిపై సంబంధిత చట్టాలు, నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయని అధికారులు స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా ఇసుక, మట్టి తరలింపునకు పాల్పడకుండా ప్రజలు, వాహన యజమానులు సహకరించాలని సూచించారు.

LALITH KUMAR, SIRPUR

LALITH KUMAR, SIRPUR