Mancherial: సూర్యనగర్, తిలక్‌నగర్‌లో నివాసాలను ముంచెత్తిన వర్షపు నీరు!

Mancherial: మంచిర్యాల జిల్లా కేంద్రంలో భారీ వర్షాల కారణంగా సూర్యనగర్ బృందావన్ కాలనీ, తిలక్‌నగర్ ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 30 July 2026 9:44 AM IST
Mancherial
X

Mancherial: సూర్యనగర్, తిలక్‌నగర్‌లో నివాసాలను ముంచెత్తిన వర్షపు నీరు!

Mancherial: మంచిర్యాల జిల్లా కేంద్రంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. నిరంతర వర్షాలకు సూర్యనగర్ బృందావన్ కాలనీ, తిలక్‌నగర్ ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు.

ఇళ్లలోకి నీరు చేరడంతో గృహోపకరణాలు తడిసిపోగా, చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు రహదారులు జలమయమవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి, జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.

ప్రతి ఏడాది వర్షాకాలంలో ఇదే పరిస్థితి ఎదురవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచి, వర్షపు నీరు నిల్వ కాకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని అధికారులను కోరుతున్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.

Next Story