Nirmal: నిర్మల్ జిల్లాలో అడవి పందుల అక్రమ రవాణా భగ్నం!

Nirmal: నిర్మల్ జిల్లా బాసర నుంచి అక్రమంగా తరలిస్తున్న 14 అడవి పందులను నవీపేట్ సమీపంలో పట్టుకున్న భైంసా రేంజ్ అటవీ శాఖ అధికారులు, వాహనాన్ని వదిలి పరారైన ముగ్గురు నిందితులు.

Srinivas, Mondol Bhainsa
Published on: 6 Oct 2026 10:35 AM IST
Nirmal
X

Nirmal: నిర్మల్ జిల్లాలో అడవి పందుల అక్రమ రవాణా భగ్నం!

Nirmal: నిర్మల్ జిల్లాలో అడవి పందులను అక్రమంగా తరలిస్తున్న ముఠాను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. ఓ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 14 అడవి పందులను బాసర నుంచి చేజ్ చేసి నవీపేట్ సమీపంలో భైంసా రేంజ్ అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు.

అధికారులను గమనించిన వాహనంలోని ముగ్గురు వ్యక్తులు వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యారు. నాందేడ్ నుంచి అడవి పందులను అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. భైంసా రేంజ్ అటవీ శాఖ అధికారులు వాహనంతో పాటు 14 అడవి పందులను స్వాధీనం చేసుకుని ఘటనపై దర్యాప్తు చేపట్టారు. పరారైన ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతోంది.

Srinivas, Mondol Bhainsa

Srinivas, Mondol Bhainsa