Adilabad: బీఆర్ఎస్‌లోకి మాజీ డీసీసీ అధ్యక్షుడు భార్గవ్ దేశ్‌పాండే

Adilabad: ఆదిలాబాద్ మాజీ డీసీసీ అధ్యక్షుడు భార్గవ్ దేశ్‌పాండే అక్టోబర్ 12న బీఆర్ఎస్‌లో చేరనున్నారు. కేసీఆర్, కేటీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 1 Oct 2026 3:54 PM IST
Adilabad
X

Adilabad: బీఆర్ఎస్‌లోకి మాజీ డీసీసీ అధ్యక్షుడు భార్గవ్ దేశ్‌పాండే

Adilabad: ఆదిలాబాద్ లో రాజకీయ సమీకరణలు మారబోతున్నాయి..పార్టీ కోసం పనిచేసిన వారికే అసెంబ్లీ టికెట్ ఇవ్వలాని డిమాండ్ చేసి సస్పేన్షన్ కు గురైన దివంగత మాజీ ఎమ్మెల్యే మనువడు, మాజీ డీసీసీ అధ్యక్షుడు భార్గవ్ దేశ్పాండే త్వరలోనే గులాబీ పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్దమైనట్లు ప్రచారం గులాబీ పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ కనిపిస్తోంది...ఇందుకు సంబందించి ఈ నెల 12న కేసీఆర్, కేటీఆర్ సమక్షంలో ఆయన బీఆర్ఎస్ లో చేరనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఆదిలాబాద్ హస్తం రాజకీయాల్లో తనదైన ముద్రవేసుకున్న భార్గవ్ దేశ్పాండే గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం పార్టీ అధిష్టానం ఆయనపై క్రమశిక్షణ చర్యల కింద సస్పెన్శన్ వేటు వేసింది..కుటుంబ పరంగా రాజకీయ వారసత్వం అందిబుచ్చుకున్న భార్గవ్ తాత మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ విఠల్ రావు దేశ్పాండే నుండి రాజకీయ వారసత్వం అందుకుని పిన్నవయసులోనే రాష్ట్ర స్థాయిలో యుత్ కాంగ్రెస్ నేతగా క్రియాశీలకంగా ఎదిగి యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు.

2011 లో ఆదిలాబాద్ లో జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ టికెట్ ఆశించగా చిన్నవయసుల్లో వద్దని వారించి అనంతరం 2014 అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ టికెట్ దక్కించుకుని పోటీచేసి ఓటమిపాలయ్యారు..అప్పటి నుండి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేశారు భార్గావ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ పార్టీకోసం పనిచేసేవారికే ఇవ్వలాని దిక్కార స్వరం వినిపించారు.

అధికారంలో లేని సమయంలో పార్టీని కాపాడుకుంటు వచ్చిన భార్గావ్ పై ఎన్నికల అనంతరం క్రమశిక్షణ చర్యలు తీసుకోగా దాదాపు మూడేళ్ళుగా సైలెంట్ గా ఉన్న పార్టీ నేతల పై కాని పార్టీ పై ఏనాడు తన అసంతృప్తి వెళ్లబుచ్చకపోగా, పార్టీ పెద్దల నుండి పిలుపు వస్తుందని ఎదురుచూస్తు వచ్చాడు..ఇదే సందర్భంలో ఆయన అనుచరులు, మద్దతుదారులు బీఆర్ఎస్ పార్టీలో చేరాలని ఓత్తిడి తేవడంతో గత వారం రోజుల క్రితం ఆదిలాబాద్ కు చెందిన మాజీ మంత్రి జోగు రామన్న, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి కేటీఆర్ ను స్వయంగా కలుసుకోగా కేటీఆర్ నుండి భార్గావ్ ను పార్టీలో రావాల్సిందిగా ఆఫర్ ఇవ్వడంతో ఈ నెల 12 వ తేదీన హైదరాబాద్ లో గులాబీ పార్టీలో చేరేందుకు రంగం సిద్దంచేసుకున్నాట్లు విశ్వసనీయ సమాచారం.

ఇదే నెల చివరివారంలో ఆదిలాబాద్ లో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లో తెలుస్తోంది..కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీతో సానిహిత్యంతో మొదలు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలు దిగ్విజయ్ సింగ్, కుంతియా, పీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, మల్లు భట్టివిక్రమార్కా, వీ హనుమంత్ రావు తదితర నేతలతో సైతం మంచి పరిచయాలు ఉండగా పార్టీ నుండి పిలుపు కోసం ఇంతకాలం ఎదురుచూసినా ఫలితం లేకపోగా ఆయన ఇక చాలంటా బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారు.

కాగా భార్గవ్ బీఆర్ఎస్ లో చేరిత ఆ పార్టీ జిల్లాలో మరింత బలంగా మారే అవకాశం ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు...ముఖ్యంగా భార్గవ్ హస్తం పార్టీకి దూరమైనప్పటి నుండి ఆయన్నే నమ్ముకున్న క్యాడర్ మాత్రం ఇంకా ఆదిలాబాద్లో తటస్థంగానే ఉన్నారు..ఆయన బీఆర్ఎస్ లో చేరితే ఆయనతో పాటు కొంతమంది నేతలు సైతం ఆ పార్టీలో చేరనున్నట్లు ప్రచారం సాగుతోంది.

ఇప్పటికే ఆదిలాబాద్ బీఆర్ఎస్ పార్టీని నడిపిస్తున్న మాజీ మంత్రి జోగు రామన్న గతంలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండి ఇప్పటికే పార్టీని కాపాడుతూవస్తున్నారు...అయితే భార్గవ్ అన్ కండీషన్ గా జాయిన్ అవుతున్నా ఒక వేల నియోజకవర్గాల పునర్విభజన జరిగితే మాత్రం ఒక స్థానం నుండి జోగు రామన్న, మరో స్తానం నుండి భార్గావ్ పోటీచేసే అవకాశం ఉంటుందని అదీ జరగకపోతే పార్టీ లో కీలకమైన పదవితో పాటు లొకల్ బాడీ మంచి స్తానం ఇస్తామని కేటీఆర్ హామీ ఇచ్చినట్లు సైతం భార్గవ్ అనుచరుల్లో ప్రచారం జరుగుతోంది.

ఇదిలా ఉంటే బార్గవ్ లాంటి నిక్కార్సైన నేతను కాంగ్రెస్ చిన్నచూపు చూడటం వల్లే ఆయన బీఆర్ఎస్ లో వెల్తున్నారని, గతంలో పార్టీ నుండి సస్పెన్షన్ కు గురై మళ్లి పార్టీలో చేరిన మిగితా ముగ్గురు నేతల్లాగే హస్తాం హైకమాండ్ తిరిగి కాంగ్రెస్లో కి ఆహ్వానిస్తే బాగుండేదని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.

మొత్తంగా మాజీ డీసీసీ అధ్యక్షులు భార్గవ్ దేశ్పాండ్ గులాబిపార్టీలో చేరికకు ముహూర్తం ఖరారుకావడంతో ఇతర పార్టీలో సైతం రాజకీయ సమీకరణలు మారుతాయంటు పొలిటికల్ సర్కిల్ లో టాక్ మొదలైంది... కాగా గత ఎన్నికవ వరకు జిల్లాలో తిరుగులేని శక్తిగా కొనసాగిన బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల అనంతరం కొన్ని నియోజకవర్గాల్లో ప్రాభల్యం లేకుండా పోయింది.

దీంతో త్వరలోనే నిర్మల్, ముధోల్ నియోజకవర్గాల్లో సైతం ఇతర పార్టీలో ఉన్న ఓ ప్రముఖ వ్యాపరవేతతో పాటు ఓ ఎన్ఆర్ఐ సైతం బీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు..గత రెండు రోజుల క్రితం ఖానాపూర్ నియోజవర్గంలోని పలువురు కాంగ్రెస్, బీజేపీ ల నుండి కేటీఆర్ సమక్షంలో గులాబీ పార్టీలో చేరగా, దేవి నవరాత్లు్లో మంచి రోజులు ఉండటంతో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో బీఆర్ఎస్ లో భారీ చేరికలుంటాయనే ప్రచారం బలంగా సాగుతోంది.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.