Nirmal: నిర్మల్‌లో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం!

Nirmal: నిర్మల్‌లోని ప్రియదర్శిని నగర్‌లో లయన్స్ క్లబ్, బసవతారకం ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం నిర్వహణ.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 6 Sept 2026 2:16 PM IST
Nirmal
X

Nirmal: నిర్మల్‌లో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం!

Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రియదర్శని నగర్ కాలనీలో నిర్మల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బసవతారకం ఎండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి వైద్యుల ద్వారా ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి పట్టణంలోని ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారు.

ఈ సందర్భంగా ప్రజలకు డాక్టర్లు క్యాన్సర్ పై అవగాహన కల్పించారు. క్యాన్సర్ లక్షణాలు, వాటి పర్యావసానాలు, వ్యాధి నయం పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ నేటి సమాజంలో పదిమందిలో ఒకరికి క్యాన్సర్ వ్యాధి బయటపడుతుందని, అందుకే భయంకరమైన ఈ వ్యాధి నుండి తమను తాము రక్షించుకునేందుకు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని నిర్వహిస్తున్నామన్నారు.

బసవతారకం ఆసుపత్రి సిబ్బంది మాట్లాడుతూ బసవతారకం ఇండో అమెరికన్ ఆసుపత్రి ద్వారా నిర్మల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని, దీనికి ప్రజల నుండి అపూర్వ స్పందన లభించిందన్నారు, ప్రజలకు ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, వ్యాధి తీవ్రత ఉంటే హైదరాబాద్ బసవతారకం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తామన్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL

Next Story