Nirmal: స్వప్న హాస్పిటల్ ఆధ్వర్యంలో కార్డియో, ఆర్తో వైద్య పరీక్షలు!
Nirmal: నిర్మల్ జిల్లా కడెంలో స్వప్న మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి ప్రజల నుంచి భారీ స్పందన లభించింది.
Nirmal: స్వప్న హాస్పిటల్ ఆధ్వర్యంలో కార్డియో, ఆర్తో వైద్య పరీక్షలు!
Nirmal: నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. స్వప్న మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఉచిత కార్డియో, ఆర్తో వైద్య శిబిరానికి ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. కడెం ఎస్సై సాయి ఈ క్యాంపును సందర్శించి, వైద్యులను అభినందించారు.
నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలో స్వప్న మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరంలో అనుభవజ్ఞులైన వైద్యులు రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేశారు.
ఈ ఉచిత వైద్య శిబిరాన్ని కడెం సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్సై) సాయి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు, గ్రామీణ ప్రజల కోసం ఇలాంటి ఉచిత సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని హాస్పిటల్ యాజమాన్యాన్ని, వైద్య బృందాన్ని కొనియాడారు.
ఉచిత క్యాంపునకు ఉమ్మడి కడెం మరియు దస్తురాబాద్ మండలాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు శిబిరానికి వచ్చిన రోగులకు ఉచితంగా ఈసీజీ (ECG), 2D ఎకో (2D Echo) మరియు ఎముకలకు సంబంధించిన (Orthopedics) పలు రకాల అత్యాధునిక పరీక్షలను డాక్టర్లు ఉచితంగా నిర్వహించి, వారికి తగిన వైద్య సలహాలు, సూచనలు అందజేశారు.




