Adilabad: హిట్‌వీడ్ మ్యాక్స్'తో 30 రోజుల పాటు కలుపునకు బ్రేక్!

Adilabad: గోద్రేజ్ ఆగ్రోవెట్ ఆధ్వర్యంలో పత్తి రైతులకు అవగాహన సదస్సు జరిగింది. హిట్‌వీడ్ మ్యాక్స్ ద్వారా పంట ప్రారంభ దశలోనే కలుపును ఎలా అరికట్టాలో వివరించారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 7 July 2026 9:36 PM IST
Adilabad
X

Adilabad: హిట్‌వీడ్ మ్యాక్స్'తో 30 రోజుల పాటు కలుపునకు బ్రేక్!

ఆదిలాబాద్: పత్తి పంటలో సకాలంలో కలుపు నియంత్రణ చేపట్టడం ద్వారా మెరుగైన సాధించవచ్చని గోద్రేజ్ ఆగ్రోవెట్ ప్రతినిధులు తెలిపారు. ఆదిలాబాద్ లో నిర్వహించిన అవగాహన సదస్సులో రైతులకు పలు సూచనలు చేశారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో గడ్డి జాతి, వెడల్పాటి ఆకుల కలుపు మొక్కలు వేగంగా పెరిగి పంటతో పోటీ పడుతున్నాయని వివరించారు.

పంట ప్రారంభ దశలోనే 2-3 ఆకుల దశలో కలుపు నియంత్రణ చేయడం చాలా ముఖ్యమని, హిట్‌వీడ్ మ్యాక్స్ వంటి మందుల వినియోగం ద్వారా 25-30 రోజుల పాటు సమర్థవంతమైన నియంత్రణ సాధ్యమవుతుందని తెలిపారు. రైతులు శాస్త్రీయ పద్ధతులు అనుసరిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని సూచించారు.

ఈ కార్యక్రమంలో గోద్రేజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్‌ ప్రతినిధులు నరసింహ రెడ్డి, మధు, శరత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story