Nirmal: నిర్మల్‌లో తెలంగాణ అవతరణ సంబరాలు
Nirmal: అమరవీరులకు నివాళులర్పించి, జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం, కలెక్టర్ భవేష్ మిశ్రా, ఎస్పీ జానకి షర్మిల.
Nirmal: నిర్మల్‌లో తెలంగాణ అవతరణ సంబరాలు
నిర్మల్: జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరయ్యారు. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అమర వీరులకు ఘన నివాళ్ళు అర్పించి, జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ ఎందరో అమర వీరుల త్యాగాలు, ఉద్యమకారుల పోరాట ఫలితమే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అన్నారు.
ప్రజల సంక్షేమము, సమగ్ర అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమన్నారూ. ఆ దిశగా ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక ద్వారా ఆరోగ్యం, విద్య, రైతు సంక్షేమము, మహిళా సాధికారత వంటి తదితర రంగాల్లో అభివృద్ధి నమోదు చేస్తోందన్నారు. అంతకు ముందు విద్యార్థులు ప్రదర్శించిన సాంసృతిక ప్రదర్శనలు ఆకట్టున్నాయి.ఈ కార్యక్రమంలో కలెక్టర్ భవేష్ మిశ్రా, ఎస్పీ జానకి షర్మిలతో పాటు ఆయా శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.




