Asifabad: కన్నెపల్లిలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు!
Asifabad: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం కన్నెపల్లిలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. సర్పంచ్ మోర్లె పార్వతి ఆడపడుచులకు కానుకలు అందజేశారు.
Asifabad: కన్నెపల్లిలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు!
Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం కన్నెపల్లి గ్రామంలో సద్దుల బతుకమ్మ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామంలోని ఆడపడుచులు, మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి భక్తిశ్రద్ధలతో బతుకమ్మ పండుగను జరుపుకున్నారు.
ఈ సందర్భంగా కన్నెపల్లి గ్రామ సర్పంచ్ మోర్లె పార్వతి ఆడపడుచులకు బతుకమ్మ కానుకలను అందజేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొని వారి ఆనందంలో పాలుపంచుకున్నారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను గ్రామ మహిళలు ఉత్సాహంగా జరుపుకోవడం పండుగ వాతావరణాన్ని మరింత సందడిగా మార్చింది. మహిళలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు, ఆడపడుచులు, యువకులు నాయకులు,గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.




