Rompally: రొంపల్లిలో వైభవంగా ఊరడమ్మ అమ్మవారి మకరతోరణోత్సవం!
Rompally: రొంపల్లి గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ ఊరడమ్మ అమ్మవారి మకరతోరణోత్సవం ఘనంగా జరిగింది. మాజీ ఎంపీపీ డాక్టర్ ఎం. రామచంద్రరావు, భక్తులు పాల్గొన్నారు.
Rompally: రొంపల్లిలో వైభవంగా ఊరడమ్మ అమ్మవారి మకరతోరణోత్సవం!
Rompally: మండల పరిధిలోని రొంపల్లి గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ ఊరడమ్మ అమ్మవారి మకరతోరణోత్సవం మంగళవారం నాడు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది. ఉదయం 8:45 గంటల నుండి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, హోమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ పూజా మహోత్సవంలో మాజీ మండల అధ్యక్షులు డాక్టర్ ఎం. రామచంద్రరావు గారు వారి ధర్మపత్నితో కలిసి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు సమర్పించారు. అలాగే గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గారు, గ్రామ పెద్దలు చందు సింగ్, సంగమేశ్వర్, కృష్ణ గౌడ్, మల్లేశం, శ్రీకాంత్ రెడ్డి, నర్సింహులు, ఇతర ప్రజాప్రతినిధులు మరియు గ్రామ ప్రముఖులు ఈ వేడుకల్లో విశేషంగా పాల్గొన్నారు.
గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం భక్తులందరికీ తీర్థ ప్రసాద వితరణ మరియు విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అందరి సహకారంతో ఈ ఉత్సవం దిగ్విజయంగా ముగిసిందని, గ్రామానికి అమ్మవారి కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.




