Nirmal: నిర్మల్ సోఫీ నగర్‌లో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన పూజలు!

Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలోని సోఫీ నగర్‌లో శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని 200 మంది మహిళలు భక్తిశ్రద్ధలతో కుంకుమార్చన పూజలు నిర్వహించారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 17 Oct 2026 11:47 AM IST
Nirmal
X

Nirmal: నిర్మల్ సోఫీ నగర్‌లో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన పూజలు!

Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలోని సోఫీ నగర్‌ కాలనీ లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి దాదాపు 200 మంది మహిళలు పెద్ద ఎత్తున కుంకుమార్చన నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి భక్తితో కుంకుమార్చన సమర్పించారు. భక్తి పారవశ్యంతో సాగిన ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అనంతరం భక్తులు అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. తమ కుటుంబ సభ్యులతో పాటు పిల్లాపాపలను చల్లంగా చూడాలని భక్తులు ఆకాంక్షించారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL