Asifabad: డబ్బా గ్రామంలో వైభవంగా పోచమ్మ తల్లి బోనాలు!

Asifabad: ఆసిఫాబాద్ జిల్లా డబ్బా గ్రామంలో ఘనంగా పోచమ్మ బోనాల మహోత్సవాలు. భక్తిశ్రద్ధలతో బోనాలు ఎత్తి ప్రత్యేక పూజలు నిర్వహించిన మహిళలు.

SRINIVAS, KOUTALA
Published on: 2 Aug 2026 1:02 PM IST
Asifabad
X

Asifabad: డబ్బా గ్రామంలో వైభవంగా పోచమ్మ తల్లి బోనాలు!

బోనమెత్తిన మహిళ భక్తులు

బోనాల మహోత్సవాల్లో పాల్గొన్న మహిళలు

బారెగుడ గ్రామంలో బోనాలతో జనసందోహం

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామంలో నిర్వహించిన ఆషాఢ బోనాల మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా జరిగాయి.

ఈ సందర్భంగా మహిళలు భక్తులు గ్రామస్థులు గ్రామ దేవత పోచమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ

బోనాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

ప్రజలపై గ్రామ దేవత పోచమ్మ అమ్మవారి కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు.

సకాలంలో వర్షాలు కురవాలని పంటలు పండాలని ప్రజలంతా రైతులంతా సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు

బోనాల పండుగ మన సంస్కృతిని భావితరాలకు చేరవేసే గొప్ప ఆధ్యాత్మిక ఉత్సవమని పేర్కొన్నారు.

ఈ కారిక్రమంలో అభయ ఆంజనేయ స్వామి ఆలయ అర్చకులు తూమోజు తిరుమలచార్య గ్రామ పెద్దలు మోర్లే పోషయ్య జయంత్ రామయ్య ఠాక్రే గణపతి మాలి సంఘం మరియు SRS యూత్ అధ్యక్షుడు గుర్లే శ్రీనివాస్ మాలి సంఘం నాయకులు పూలే సేవ సమితి సభ్యులు గ్రామస్థులు మహిళలు యువతి యువకులు తదితరులు పాల్గొన్నారు

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA

Next Story