Adilabad: జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో గుడిహత్నూర్ యువకుడి ఆల్ ఇండియా ర్యాంక్
Adilabad: దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రానికి చెందిన ఓం ప్రసాద్ అద్భుత ప్రతిభ
Adilabad: జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో గుడిహత్నూర్ యువకుడి ఆల్ ఇండియా ర్యాంక్
Adilabad: దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, కఠినమైన జేఈఈ అడ్వాన్స్‌డ్ (JEE Advanced) ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రానికి చెందిన ముండే సంజీవ్ కుమారుడు ఓం ప్రసాద్ అద్భుత ప్రతిభ కనబరిచాడు. జాతీయ స్థాయిలో జరిగిన ఈ పరీక్షలో ఓం ప్రసాద్ ఆల్ ఇండియా 2014వ ర్యాంక్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఒక సాధారణ కుటుంబానికి చెందిన యువకుడు దేశవ్యాప్తంగా ఇంతటి ఉత్తమ ర్యాంక్ సాధించడం పట్ల మండలంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ఐఐటీల్లో (IIT) సీటు సాధించడమే లక్ష్యంగా కష్టపడి చదివిన తన కొడుకు, ఈరోజు దేశంలోనే అత్యున్నత పరీక్షలో ఇంతటి విజయం సాధించడంపై తండ్రి ముండే సంజీవ్ తో పాటు కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓం ప్రసాద్ సాధించిన ఈ చారిత్రాత్మక విజయంపై జిల్లా ప్రముఖులు, మండల ప్రజలు, స్నేహితులు మరియు బంధువులు ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు.
ఓం ప్రసాద్ పట్టుదల, కష్టపడే తత్వం మున్ముందు దేశానికి, పుట్టిన ఊరికి, కన్న తల్లిదండ్రులకు మరింత మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ.. ఆయనకు ఉజ్వల భవిష్యత్తు కలగాలని పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.




