Gudihathnoor: ధరలు తగ్గించకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు.. కాంగ్రెస్ నేత హెచ్చరిక!

Gudihathnoor: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి పెంచడాన్ని ఆదిలాబాద్ డీసీసీ ప్రధాన కార్యదర్శి మల్యాల కరుణాకర్ తీవ్రంగా ఖండించారు.

NAGULA SATISH, BOATH
Published on: 20 May 2026 1:42 PM IST
Gudihathnoor
X

Gudihathnoor: ధరలు తగ్గించకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు.. కాంగ్రెస్ నేత హెచ్చరిక!

గుడిహత్నూర్: ​కేంద్ర ప్రభుత్వం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి సామాన్య ప్రజలపై మోయలేని భారం వేయడాన్ని ఆదిలాబాద్ డీసీసీ ప్రధాన కార్యదర్శి మల్యాల కరుణాకర్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా గుడిహత్నూర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ, దేశంలో ధరలు పెంచడం కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిదర్శనమని మండిపడ్డారు. కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్ల రాయితీలు ఇస్తూ, పేద, మధ్య తరగతి ప్రజల జేబులకు చిల్లు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దుబ్బాక నరేష్, పోలే విష్ణు, ఎక్నాథ్ పటేల్, ఉప సర్పంచ్ గణపతి తదితరులు పాల్గొన్నారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH

Next Story