Gudihathnoor: ఇంధన ధరల పెంపుపై కాంగ్రెస్ ఆగ్రహం
Gudihathnoor: పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భీకర నిరసన ప్రదర్శన చేపట్టారు.
Gudihathnoor: ఇంధన ధరల పెంపుపై కాంగ్రెస్ ఆగ్రహం
Gudihathnoor: పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ గుడిహత్నూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి తమ నిరసనను తెలియజేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక వైఖరిని ఎండగడుతూ, పెంచిన ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తొడసం దౌలత్ రావు, సీనియర్ నాయకులు అంకిత్ రవీందర్, బాలాజీ పటేల్, నాగనాథ్ అప్పా, దిగంబర్, డాక్టర్ అశోక్, రమేష్, గణేష్ గౌడ్ లతో పాటు పార్టీ నాయకులు ఆడే జైపాల్, చెట్ల మహేష్, భారత్ తదితరులు పాల్గొన్నారు.
Next Story




