Adilabad: గుడిహత్నూర్ నుంచి పండరీపురానికి తరలివెళ్లిన భక్తులు!

Adilabad: గుడిహత్నూర్ నుంచి మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పండరీపురానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు.యాత్రకు ముందు శివాలయంలో ప్రత్యేక భజనలు, పూజలు.

NAGULA SATISH, BOATH
Published on: 5 July 2026 3:03 PM IST
Adilabad
X

Adilabad: గుడిహత్నూర్ నుంచి పండరీపురానికి తరలివెళ్లిన భక్తులు!

ఆదిలాబాద్: మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పండరీపురంలో కొలువై ఉన్న ఆ విఠల నాథుడిని దర్శించుకునేందుకు గుడిహత్నూర్ నుండి భక్తులు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు,

ఈ యాత్ర కోసం ప్రత్యేకంగా పూల మాలలు, తోరణాలతో భక్తిభావం ఉట్టిపడేలా అలంకరించిన వాహనంలో భక్తులు ప్రయాణమయ్యారు.

​యాత్రకు బయలుదేరే ముందు శివాలయ ప్రాంగణంలో భక్తులు విఠల-రుక్మిణీ సమేతంగా ప్రత్యేక అర్చనలు, భజనలు నిర్వహించారు. హరి నామ నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. భక్తుల ప్రయాణం క్షేమంగా సాగాలని, స్వామివారి కృప అందరిపై ఉండాలని కోరుకుంటూ గ్రామ పెద్దలు, ప్రతినిధులు వారికి ఘనంగా వీడ్కోలు పలికారు.

ఈ ప్రత్యేక కార్యక్రమంలో గ్రామ సర్పంచి ఆడే షీలా, ఉప సర్పంచ్ నిఖిల్, గ్రామ పెద్దలు మాధవ్ పటేల్, శ్రీరామ్, డాక్టర్ లక్ష్మణ్, యువ నాయకులు ఆడే జైపాల్ తదితరులు పాల్గొన్నారు, ప్రతి ఏటా పండరీపూర్ యాత్రను భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని, ఈ సారి కూడా స్వామివారిని దర్శించుకునే భాగ్యం కలగడం పట్ల యాత్రికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రత్యేక వాహనంలో బయలుదేరిన భక్తుల బృందంతో గుడిహత్నూర్ గ్రామంలో పండుగ వాతావరణం కనిపించింది.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH

Next Story