Gudihathnoor: వన్యప్రాణుల ముఠాను పట్టిన గుడిహత్నూర్ పోలీసులు
Gudihathnoor: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ పరిధిలోని చిన్న మన్నూరు అడవుల్లో వన్యప్రాణుల వేటగాళ్ల ముఠా అరెస్ట్.
Gudihathnoor: వన్యప్రాణుల ముఠాను పట్టిన గుడిహత్నూర్ పోలీసులు
గుడిహత్నూర్: గుడిహత్నూర్ మండల పరిధిలోని చిన్న మన్నూరు అటవీ ప్రాంతంలో వన్యప్రాణులను వేటాడేందుకు వెళ్లిన నలుగురు వ్యక్తులను గుడిహత్నూర్ ఎస్సై ఎల్ శ్రీకాంత్ మరియు పోలీసు సిబ్బంది ఈరోజు ఉదయం అదుపులోకి తీసుకున్నారు.
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు ఇచ్చోడా రూరల్ సీఐ సిహెచ్ రమేష్ పర్యవేక్షణలో ఈ అరెస్ట్ జరిగింది. పట్టుబడిన నిందితులు అల్లకుంట లకన్, అల్లకుంట తాళయ్య, అల్లకుంట తిరుపతి, అల్లకుంట నాగయ్యల వద్ద నుండి 3 కత్తులు, 50 అడుగుల ఉచ్చు వైర్, రెండు బైకులు మరియు ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
నిందితులపై గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు ఉంటాయని, ప్రజలు ఇలాంటి విషయాలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన హెచ్చరించారు.




