Gudihatnoor: గుడిహత్నూర్‌లో బీఆర్ఎస్ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ ధర్నా!
Gudihatnoor: గుడిహత్నూర్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకుల వైఖరికి నిరసనగా ధర్నా. తొడసం దౌలత్ రావు నేతృత్వంలో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు సమర్పణ.
Gudihatnoor: గుడిహత్నూర్‌లో బీఆర్ఎస్ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ ధర్నా!
Gudihatnoor: బీఆర్ఎస్ నాయకుల అహంకార, అప్రజాస్వామ్య వైఖరికి నిరసనగా శనివారం గుడిహత్నూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద మండల కాంగ్రెస్ అధ్యక్షులు తొడసం దౌలత్ రావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. డీసీసీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలన అందిస్తుంటే బీఆర్ఎస్ నాయకులు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు.
దళిత స్పీకర్‌ను అవమానించడం, మహిళా పోలీసుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, సీఎంపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అనంతరం బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు మారుతి, నరేష్ దుబ్బాక, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు వాగుమారే విశ్వంబర్, నాయకులు ఆడే శీల, నాగనాథ్ అప్ప, మాస్కె మాధవ్, ససనే మాధవ్, అంకిత రవి, రాథోడ్ రమేష్, ఆరిఫ్ ఖాన్, కోట్నాక గణేష్, రాచర్ల నారాయణ, జాదవ్ శ్రీకాంత్, దొమ్మాట్టి సురేష్, గణేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.




