Gudihatnoor: గుడిహత్నూర్లో ఈ నెల 18న వంజరి సంఘం దసరా మేళా!
Gudihatnoor: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మన్నూరు ఎస్ కన్వెన్షన్ హాల్లో ఈ నెల 18న వంజరి సంఘం దసరా మేళా. తెలంగాణ, మహారాష్ట్రల నుంచి భారీగా తరలిరావాలని పిలుపు.
Gudihatnoor: గుడిహత్నూర్లో ఈ నెల 18న వంజరి సంఘం దసరా మేళా!
Gudihatnoor: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని మన్నూరు ఎస్ కన్వెన్షన్ హాల్లో ఈ నెల 18వ తేదీన వంజరి సంఘం ఆధ్వర్యంలో దసరా మేళాను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ సంఘం ప్రతినిధులు ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ మేళాకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నలుమూలల నుంచే కాకుండా, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వంజరి కుల బాంధవులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. అలాగే సరిహద్దు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి కూడా భారీగా ప్రతినిధులు, కుల బంధువులు హాజరుకానున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. సమాజంలో ఐక్యతను పెంపొందించడం, సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించడంతో పాటు పలు సామాజిక అంశాలపై చర్చించేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు. వంజరి కుల బాంధవులందరూ అధిక సంఖ్యలో తరలివచ్చి ఈ దసరా మేళాను విజయవంతం చేయాలని నిర్వాహక కమిటీ సభ్యులు కోరారు.




