Adilabad: గుడిహత్నూర్‌లో ఘనంగా 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీ!
Adilabad: గుడిహత్నూర్ మండల కేంద్రంలో 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీ జరిగింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్ జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.
Adilabad: గుడిహత్నూర్‌లో ఘనంగా 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీ!
Adilabad: దేశభక్తి భావాన్ని చాటిచెప్పే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమం గుడిహత్నూర్ మండల కేంద్రంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండాను చేతబూని ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులు, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.
'హర్ ఘర్ తిరంగా' ద్వారా ప్రజల్లో, ముఖ్యంగా యువతలో దేశభక్తి స్ఫూర్తి మరింత పెంపొందుతుందని పేర్కొన్నారు. ప్రతి పౌరుడూ తమ ఇళ్లపై గౌరవప్రదంగా జాతీయ జెండాను ఎగురవేసి దేశ ఐక్యత, సమగ్రతను చాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల, జిల్లా స్థాయి నాయకులు, కార్యకర్తలు, యువకులు మరియు స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.




