Gudihatnur: గుడిహత్నూర్ రూట్లో ఆర్టీసీ బస్సు ఛార్జీల వాత

Gudihatnur: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మార్గంలో డిపోల వారీగా మారుతున్న బస్సు ఛార్జీలు. ఉట్నూర్ డిపో బస్సుల్లో అదనపు వసూళ్లపై ప్రయాణికుల తీవ్ర ఆగ్రహం.

NAGULA SATISH, BOATH
Published on: 24 July 2026 7:24 PM IST
Gudihatnur
X

Gudihatnur: గుడిహత్నూర్ రూట్లో ఆర్టీసీ బస్సు ఛార్జీల వాత

గుడిహత్నూర్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) అధికారుల అస్తవ్యస్త వైఖరితో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం శ్యాంపూర్ నుండి గుడిహత్నూర్ వరకు సాధారణ ఆర్డినరీ/పల్లెవెలుగు బస్సు చార్జీ రూ. 30 కాగా, కేవలం ఉట్నూర్ డిపో బస్సుల్లో మాత్రం రూ. 40 వసూలు చేస్తుండటంపై ప్రయాణికులు మండిపడుతున్నారు.

​శ్యాంపూర్ నుండి గుడిహత్నూర్‌కు ప్రతిరోజూ ప్రయాణించే లక్ష్మీకాంత్ అనే ప్రయాణికుడు ఈ విషయమై కండక్టర్‌ను నిలదీయగా.. "ఇంతే వసూలు చేస్తాం, మీ ఇష్టం ఉన్న చోట చెప్పుకోండి లేదా బస్సు దిగిపోండి" అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని వాపోయారు.

ఆదిలాబాద్ డిపో బస్సులో రూ. 30 పడుతుంటే, ఉట్నూర్ డిపో బస్సులో రూ. 10 అదనంగా వసూలు చేయడంపై స్పష్టత లేకపోవడం ప్రయాణికుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తోంది. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఈ వ్యత్యాసాన్ని సరిదిద్ది, ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్న ఉట్నూర్ డిపో వైఖరిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH

Next Story