Nirmal: SIR ప్రక్రియను వెంటనే నిలిపివేయాలి: AISF డిమాండ్

Nirmal: ఓటు హక్కును కాలరాసే SIR ప్రక్రియను నిలిపివేయాలని, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ గాంధీ పార్కు వద్ద AISF నిరసన చేపట్టింది.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 31 Oct 2026 2:17 PM IST
Nirmal
X

Nirmal: SIR ప్రక్రియను వెంటనే నిలిపివేయాలి: AISF డిమాండ్

నిర్మల్ జిల్లా: ఓటు హక్కును కాలరాసే విధంగా సాగుతున్న SIR ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని, ఎన్నికల కమిషన్ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) నిర్మల్ జిల్లా సమితి డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా గాంధీ పార్కులోని గాంధీ విగ్రహం ముందు AISF నిర్మల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో నిరసనను వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా AISF నిర్మల్ జిల్లా కార్యదర్శి కైలాష్ మాట్లాడుతూ, ఓటు హక్కు అనేది భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన ప్రాథమిక ప్రజాస్వామ్య హక్కు అని అన్నారు. అర్హులైన ఓటర్ల పేర్లను ఓటరు జాబితాల నుంచి తొలగించే ప్రమాదం ఉన్న SIR ప్రక్రియ పట్ల ప్రజల్లో ఆందోళన నెలకొందని పేర్కొన్నారు. ఓటరు జాబితాల సవరణ పేరుతో ఒక్క అర్హుడైన పౌరుడి ఓటు హక్కు కూడా కోల్పోకూడదని స్పష్టం చేశారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఓటు విలువైనదని, ఓటు హక్కును పరిరక్షించడం ఎన్నికల కమిషన్ బాధ్యత అని అన్నారు. ఓటరు జాబితాల సవరణ ప్రక్రియ పారదర్శకంగా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించాలని డిమాండ్ చేశారు.

అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించే చర్యలను తక్షణమే నిలిపివేయాలని, ఓటు హక్కును కాపాడాలని, SIR ప్రక్రియపై పునరాలోచన చేయాలని AISF నాయకులు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించడంలో విఫలమైన జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కోరారు. ఓటు హక్కు పరిరక్షణ కోసం విద్యార్థి సమాజం, ప్రజాస్వామ్యవాదులు ఐక్యంగా ముందుకు రావాలని AISF పిలుపునిచ్చింది.

ఈ కార్యక్రమంలో AISF జిల్లా కార్యదర్శి కైలాష్, అధ్యక్షులు అస్లం, నాయకులు వినేష్, అఖిల్, సిద్దు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL