Kuntala: కుంటాలలో హార్వెస్టర్ బీభత్సం.. ముగ్గురికి గాయాలు

Kuntala: నిర్మల్ జిల్లా కుంటాల వారసంతలో డ్రైవర్‌కు మూర్ఛ వచ్చి హార్వెస్టర్ అదుపుతప్పి బైకులను ఢీకొనడంతో ముగ్గురు గాయపడ్డారు. డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Srinivas, Mondol Bhainsa
Published on: 25 Oct 2026 8:00 PM IST
Kuntala
X

Kuntala: కుంటాలలో హార్వెస్టర్ బీభత్సం.. ముగ్గురికి గాయాలు

నిర్మల్ జిల్లా: కుంటాల మండల కేంద్రంలో హార్వెస్టర్ అదుపుతప్పి బీభత్సవం సృష్టించింది.ఆదివారం కుంటాల మండల కేంద్రంలో వారసంత కావడంతో జనసందోహం ఎక్కువగా ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.అంబకంటి నుంచి కుంటాల మీదుగా లోకేశ్వరం వెళ్తున్న హార్వెస్టర్.. కుంటాల సంతలో నుంచి వెళ్తుండగా డ్రైవర్‌కు అకస్మాత్తుగా కళ్లు తిరిగి మూర్ఛ రావడంతో వాహనం అదుపుతప్పి మొదట బైకులను ఢీకొట్టింది.

ఆ తర్వాత అక్కడున్న కుంటాల మండల కేంద్రానికి చెందిన ఓ మహిళతో పాటు అంబకంటికి చెందిన ఇద్దరు గాయపడ్డారు. వీరిలో ఒకరికి తలకు తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరికి చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి.గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు.

వారసంత కావడంతో భారీగా జనం ఉన్నప్పటికీ హార్వెస్టర్ మొదటగా బైకులను ఢీకొట్టడంతో పెను ప్రమాదం తప్పింది. హార్వెస్టర్ నడుపుతున్న డ్రైవర్ బిరేల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా తెలిసింది.ఘటనపై పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు పూర్తి దర్యాప్తు చేస్తున్నారు.

Srinivas, Mondol Bhainsa

Srinivas, Mondol Bhainsa