Adilabad: ఆదిలాబాద్ రిమ్స్‌ను సందర్శించిన మంత్రి దామోదర రాజనర్సింహ!
Adilabad: ఆదిలాబాద్ రిమ్స్ నవజాత శిశువుల వార్డులో అగ్నిప్రమాదం: ఆస్పత్రిని పరిశీలించిన వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ. సమగ్ర విచారణకు కమిటీ వేస్తామని వెల్లడి.
Adilabad: ఆదిలాబాద్ రిమ్స్‌ను సందర్శించిన మంత్రి దామోదర రాజనర్సింహ!
ఆదిలాబాద్: ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలోని నవజాత శిశువుల వార్డులో జరిగిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం రిమ్స్ ఆస్పత్రిని సందర్శించారు. అగ్ని ప్రమాదం అనంతరం చేపట్టిన సహాయక చర్యలను మంత్రి పరిశీలించారు.
నవజాత శిశువుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహా మాట్లాడుతూ అగ్నిప్రమాదం ఘటన షాట్ సర్క్యూట్ వల్ల ఏసీలో మంటలు వచ్చి జరిగిందని,పొగ వల్ల పిల్లలు అస్వస్థకు గురయ్యారన్నారు..ఘటనకు గల కారణాలతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని,
సంఘటనపై కమిటీ వేసి పూర్తిస్థాయి విచారణ చేపడుతాం, నివేదిక ఆధారంగా చర్యలు చేపడతాం అన్నారు. రిమ్స్ లో ఐపి, ఓపి పెరిగింది. రిమ్స్ సామర్థ్యం పెంచాల్సి ఉంది, మరింత బలోపేతం చేయాల్సి ఉందని, రిమ్స్ లో కొత్త కోర్సులు, కొత్త డిపార్ట్మెంట్ లను కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, వివిధ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులందరికీ మెరుగైన చికిత్సలు అందిస్తున్నామని, మృతుల కుటుంబాలను ఆదుకునే విషయమై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు మంత్రి దామోదర.




