Kadem: కడెం ప్రాజెక్టుకు భారీ వరద.. రైతన్నల్లో కొత్త ఆశలు!
Kadem: నిర్మల్ జిల్లా కడెం, దస్తురాబాద్ మండలాల్లో వర్షాల కారణంగా కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టుకు భారీ వరద నీరు వచ్చి చేరుతోంది.
Kadem: కడెం ప్రాజెక్టుకు భారీ వరద.. రైతన్నల్లో కొత్త ఆశలు!
Kadem: నిర్మల్ జిల్లా కడెం, దస్తురాబాద్, రైతాంగానికి తీపి కబురు. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు పడక తీవ్ర నిరాశలో ఉన్న అన్నదాతలకు వరుణ దేవుడు కరుణించాడు. గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలతో కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిండుకుండలా మారిన కడెం ప్రాజెక్టు
వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఎల్ నినో ప్రభావం వల్ల ఈ ఏడాది అసలు వర్షాలు కురవవేమోనని, పంటలు ఎలా పండుతాయోనని నిరాశలో ఉన్న ఆయకట్టు రైతుల్లో ఈ వర్షాలు కొత్త ఆశలను చిగురింపజేశాయి.
గత ఏడాదితో పోలిస్తే ఈసారి దాదాపు 25 రోజులు ఆలస్యంగా నాట్లు వేయాల్సి వచ్చిందని రైతులు ఆవేదన చెందారు. అయితే, ప్రస్తుత వరద ప్రవాహంతో కడెం ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చి చేరుతుండటంతో రైతుల కళ్లలో ఆనందం వెల్లివిరుస్తోంది. ఆలస్యమైనప్పటికీ, ఇకపై తమ వ్యవసాయ పనులను యధావిధిగా, వేగంగా ముగించుకుంటామని రైతన్నలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నిండుకుండను తలపిస్తున్న కడెం ప్రాజెక్టును చూసి ఆయకట్టు పరిధిలోని గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.




