Adilabad: ఉప్పొంగుతున్న కుంటాల, పొచ్చెర జలపాతాలు.. ప్రకృతి అందాలు!

Adilabad: ఆదిలాబాద్‌ వర్షాలకు కుంటాల, పొచ్చెర జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. ఈ ప్రకృతి అందాలను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు.

NAGULA SATISH, BOATH
Published on: 29 July 2026 12:31 PM IST
Adilabad
X

Adilabad: ఉప్పొంగుతున్న కుంటాల, పొచ్చెర జలపాతాలు.. ప్రకృతి అందాలు!

పరవళ్ళు తొక్కుతున్న కుంటాల, పొచ్చెర జలపాతాలు.. కిటకిటలాడుతున్న పర్యాటక ప్రాంతాలు

నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ వర్షాల ధాటికి జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలైన కుంటాల, పొచ్చెర జలపాతాలకు ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

జలపాతాలు ఉప్పొంగి పరవళ్ళు తొక్కుతుండటంతో ఆ ప్రాంతాలన్నీ కనువిందు చేసే ప్రకృతి అందాలతో శోభిల్లుతున్నాయి. హోరెత్తే నీటి హోరు, దట్టమైన అటవీ సంపద మధ్య జలపాతాల సౌందర్యం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వర్షాల నేపథ్యంలో జలపాతాల అందాలను తిలకించేందుకు వివిధ జిల్లాల నుండి పర్యాటకులు భారీ సంఖ్యలో తరలివస్తుండటంతో అక్కడ కోలాహలం నెలకొంది. పర్యాటకుల రాక పెరగడంతో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా అధికారులు చర్యలు చేపట్టారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH

Next Story