Ichoda: ఇచ్చోడలో విషాదం.. విధుల్లో ఉండగానే ఫైర్ ఆఫీసర్ మృతి!
Ichoda: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ అగ్నిమాపక కేంద్రంలో ఫైర్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎండీ షఫీ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.
Ichoda: ఇచ్చోడలో విషాదం.. విధుల్లో ఉండగానే ఫైర్ ఆఫీసర్ మృతి!
ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో విషాదం నెలకొంది. అగ్నిమాపక కేంద్రంలో ఫైర్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎండీ షఫీ విధుల్లో ఉండగానే గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.
నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆయన ఇచ్చోడలో బాధ్యతలు వర్తిస్తుండగా, ఒక్కసారిగా గుండెపోటు రావడంతో తోటి సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
నిబద్ధతతో పనిచేసే అధికారి విధుల్లో ఉండగానే ఇలా అకస్మాత్తుగా కన్నుమూయడం పట్ల తోటి అగ్నిమాపక సిబ్బంది, పలువురు అధికారులు తీవ్ర ఆవేదన, దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
Next Story




