Khanapur: రేషన్ బియ్యం వాహనం కలకలం అధికారుల నిర్లక్ష్యం!
Khanapur: నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో అక్రమ బియ్యం వాహనాన్ని అడ్డుకున్న యువత. సమాచారం ఇచ్చినా రాని అధికారులు.
Khanapur: రేషన్ బియ్యం వాహనం కలకలం అధికారుల నిర్లక్ష్యం!
Khanapur: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో అక్రమంగా బియ్యం తరలిస్తున్నట్లు అనుమానించి టాటా మ్యాజిక్ వాహనాన్ని స్థానిక యువత నడిరోడ్డుపై అడ్డుకుని నిలిపివేశారు. వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించినప్పటికీ వారు సంఘటనా స్థలానికి చేరుకోలేదని యువత ఆరోపించింది.
స్థానికుల కథనం ప్రకారం, ఆ వాహనం సుర్జాపూర్ గ్రామ ఉపసర్పంచ్ లక్ష్మణ్‌కు చెందినదని అక్కడ ఉన్న వ్యక్తులు చెప్పినట్లు సమాచారం. అయితే అధికారులు జాప్యం చేయడంతో, టాటా మ్యాజిక్ వాహనం అక్కడి నుంచి వెళ్లిపోయిందని యువత తెలిపింది.
అక్రమ రవాణాపై సమాచారం ఇచ్చినా అధికారులు వెంటనే స్పందించకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి, పూర్తి వివరాలు వెల్లడించాలని ప్రజలు కోరుతున్నారు.
Next Story




