Mancherial: అక్రమ ఇసుక ట్రాక్టర్ల సీజ్ ఇద్దరిపై కేసు!
Mancherial: గోదావరి నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను భీమారం పోలీసులు సీజ్ చేసి, ఇద్దరిపై కేసు నమోదు చేశారు.
Mancherial: అక్రమ ఇసుక ట్రాక్టర్ల సీజ్ ఇద్దరిపై కేసు!
Mancherial: మంచిర్యాల జిల్లా అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్ల సీజ్ – ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు.
జైపూర్ మండలం శెట్పల్లి గ్రామ శివారులోని గోదావరి నది నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో భీమారం పోలీసులు అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు.
ఈ క్రమంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను భీమారం మండలం అరేపల్లి గ్రామ శివారులో పోలీసులు పట్టుకొని సీజ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి శెట్పల్లి గ్రామానికి చెందిన కుమ్మరి కిరణ్ మరియు తలారి హరీష్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని, అక్రమంగా ఇసుక తరలించినందుకు వారిపై కేసు నమోదు చేయడం జరిగింది.
అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలించడం, ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేయడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని భీమారం ఎస్.ఐ. ఏ. రాజేందర్ తెలిపారు.
భీమారం పోలీసుల సూచన, ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను తవ్వడం, తరలించడం లేదా అక్రమ రవాణాకు పాల్పడే వారిపై నిరంతరం నిఘా కొనసాగుతుందని, ప్రజలు అక్రమ ఇసుక రవాణా గురించి పోలీసులకు సమాచారం అందించాలని ఎస్.ఐ. రాజేందర్ కోరారు.




