Utnoor: ఉట్నూర్‌లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం!

Utnoor: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ఐటీడీఏ పీఓ మంద మకరందు, సబ్ కలెక్టర్ ప్రణయ్ ప్రారంభించారు.

Y RAMESH, ITDA UTNOOR
Published on: 20 Nov 2026 2:50 PM IST
Utnoor
X

Utnoor: ఉట్నూర్‌లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం!

ఆదిలాబాద్ జిల్లా: ఉట్నూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా కార్యక్రమాన్ని సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి మంద మకరందు, సబ్ కలెక్టర్ ప్రణయ్ . ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారి మంద మకరందు మాట్లాడుతూ, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రతి కుటుంబానికి ప్రయోజనం చేకూర్చే విధంగా రూపొందించబడిందని తెలిపారు. అయితే ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిమితుల దృష్ట్యా తొలుత రేషన్ కార్డులు కలిగిన కుటుంబాల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని వెల్లడించారు. రానున్న ప్రభుత్వ మార్గదర్శకాల ఆధారంగా రేషన్ కార్డులు లేని కుటుంబాలకు కూడా తగిన విధానం ద్వారా ఈ పథకం ప్రయోజనం అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Y RAMESH, ITDA UTNOOR

Y RAMESH, ITDA UTNOOR