Indravelli: ఇంద్రవెల్లిలో అమరవీరుల త్యాగాలకు సలాం!
Indravelli: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో 45వ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది.
Indravelli: ఇంద్రవెల్లిలో అమరవీరుల త్యాగాలకు సలాం!
Indravelli: ఇంద్రవెల్లి మండలంలో నేడు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, ఎంపీ నగేష్ తో పాటు మాజీ ఎంపి సోయం బాపూరావ్ లు.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో జరిగిన పోరాటంలో అనేకమంది ఆదివాసులు అమరులై నేటికీ 45 ఏళ్లు నిండాయి. ఆనాటి నెత్తుటి మరకలు గిరిజనుల గుండెల్లో నుంచి నేటివరకు చెరిగిపోలేదు ఆ చేదు జ్ఞాపకాలు అడవి బిడ్డలను వెంటాడుతూనే ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఎప్రిల్ 20 వచ్చిందంటే గిరిజన గ్రామాల్లో ఆనాటి జ్ఞాపకాలను గిరిజనులు నెమరేసుకుంటూ పోరాటంలో ఆసువులు బాసిన తమ వారికి గిరిజనులు నాయకులు నివాళులు అర్పించి స్మరించుకుంటారు.
వారి ప్రాణత్యాగం ఫలితంగానే పోడు భూములకు అటవీ హక్కు పత్రాలు వచ్చాయని ఆదివాసులు అంటున్నారు. సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసులు బారి బందోబస్తు ఏర్పాటు చేశారు.




