Adilabad: ఎన్నికల హామీ నెరవేర్చాలి సీసీఐపై జోగు రామన్న కీలక వ్యాఖ్యలు!
Adilabad: ఆదిలాబాద్ సీసీఐ పునరుద్ధరణకు ఎంపీ, ఎమ్మెల్యేలు కృషి చేయాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్. సీసీఐ సాధన కమిటీ చర్చా గోష్టిలో హాజరై ప్రసంగం.
Adilabad: ఎన్నికల హామీ నెరవేర్చాలి సీసీఐపై జోగు రామన్న కీలక వ్యాఖ్యలు!
Adilabad: ఆదిలాబాద్ లోని సీసీఐని ప్రారంభిస్తామని గతంలో ఎన్నికల సమయంలో కేంద్రం పెద్దలు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేలా స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే కృషి చేయాలని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. సిసిఐ ఫ్యాక్టరీని పునరుద్ధరణపై చేపట్టవలసిన తీసుకోవాల్సిన భవిష్యత్తు కర్తవ్యాలు అనే అంశంపై సిసిఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన చర్చ గోష్టిలో ఆయన మాట్లాడారు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సిసిఐ పునరుద్ధరణ కోసం కెసిఆర్ కేంద్రానికి లేఖ రాసిన విజయాన్ని గుర్తు చేశారు. సిసిఐ పోరాటంలో తనకు ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదన్నారు. ఫ్యాక్టరీ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సైతం స్పందించాలన్నారు. అదేవిధంగా సీసీ సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న పోరాటాలపై కొంతమంది సోషల్ మీడియా వేదికగా చేస్తున్న అసత్యపు ప్రచారాలను ఖండించారు.




