Adilabad: చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి హామీ.. శాంతించిన ఆదిలాబాద్ జొన్న రైతులు
Adilabad: ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో జొన్న రైతుల ఆందోళన. గన్నీ బ్యాగుల కొరత, కొనుగోళ్లలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బైఠాయింపు.
Adilabad: చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి హామీ.. శాంతించిన ఆదిలాబాద్ జొన్న రైతులు
ఆదిలాబాద్: వ్యవసాయ మార్కెట్ యార్డులో జొన్న రైతులు ఆందోళన దిగారు..పంట అమ్మకానికి తీసుకువత్చి రోజులు గడుస్తున్న ఎవరూ పట్టించుకోవడం లేదని, గాన్నిబ్యాగుల కొరత, గోడౌన్ లో కొలత పేరట తమను ఇబ్బందుల గురి చేస్తున్నారని ఆరోపిస్తూ రైతులు అదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో బైఠాయించి నిరసన తెలిపారు.. పంట కొనుగోలు అధికారికంగా ప్రారంభించి 10రోజులు దాటిపోతున్న ప్రభుత్వం నుండి స్పందన లేదని ఆరోపిస్తూ ఆందోళన దిగడంతో, అక్కడికి చేరుకున్న మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కారణంగా ఆలస్యం జరుగుతున్న మాట వాస్తవమేనని, కొనుగోలు పూర్తిస్థాయిలో సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతుల ఆందోళన విరమించారు.
Next Story




