Gudihathnoor: రైతులకు గుడ్ న్యూస్.. మోడల్ మార్కెట్‌కు లైన్ క్లియర్
Gudihathnoor: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్‌లో నూతన మోడల్ వెజిటబుల్ మార్కెట్ ఏర్పాటుకు రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు.
Gudihathnoor: రైతులకు గుడ్ న్యూస్.. మోడల్ మార్కెట్‌కు లైన్ క్లియర్
గుడిహత్నూర్: మండల కేంద్రంలో ఏర్పాటు చేయ తలపెట్టిన నూతన మోడల్ వెజిటబుల్ మార్కెట్ యార్డ్‌లో మౌలిక వసతుల కల్పన, నిధుల కేటాయింపునకు రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆయన వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌కు అధికారికంగా లేఖ రాశారు. ఆదిలాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ స్థానిక రైతుల అవసరాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో ఈ నిర్ణయం వెలువడింది.
ఈ మోడల్ మార్కెట్ ద్వారా రైతులకు మెరుగైన పంట నిల్వ సదుపాయాలు (స్టోరేజ్), అత్యాధునిక మార్కెటింగ్ సాంకేతికత అందుబాటులోకి వస్తాయని, తద్వారా రైతులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి ధర లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా నిధులు మంజూరు చేయాలని మంత్రి ఆదేశించడంతో గుడిహత్నూర్ పరిసర ప్రాంతాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక రైతాంగ శ్రేయస్సు కోసం ప్రత్యేక కృషి చేసిన డా. నరేష్ జాదవ్ తక్షణమే స్పందించిన మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి ఈ ప్రాంత ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.




