Nirmal: కడెం ప్రాజెక్టు నిండు కుండ ఎఫ్‌టీఎల్‌కు చేరిన నీటిమట్టం!

Nirmal: నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులకు చేరింది. ప్రాజెక్ట్ నిండుకుండలా మారడంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

RAKESH N, KHANAPUR
Published on: 25 Aug 2026 7:56 AM IST
Nirmal
X

Nirmal: కడెం ప్రాజెక్టు నిండు కుండ ఎఫ్‌టీఎల్‌కు చేరిన నీటిమట్టం!

Nirmal: కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు,కాగా ప్రస్తుతం నీటిమట్టం 700 అడుగులు గా ఉంది, కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 3.495TMC,కాగా ప్రస్తుతం 3.495 టీఎంసీ. ఇన్ ఫ్లో 812 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 571 క్యూసెక్కులు గా ఉంది.

ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తుండడంతో ఆయకట్టు రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతుంది,ఇప్పటికే ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా ఆయకట్టు ప్రాంతాల రైతులకు సాగునీరు అందుతుంది, కడం జలాశయం నిండు కుండల ఉండడంతో పరిసర ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు, భూగర్భ జలాలకు, ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం అవుతుంది.

RAKESH N, KHANAPUR

RAKESH N, KHANAPUR

Next Story