Kagaznagar: కాగజ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో 5 డయాలసిస్ బెడ్లు ప్రారంభం!
Kagaznagar: ఆసిఫాబాద్: కాగజ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో అదనపు 5 డయాలసిస్ బెడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే హరీష్ బాబు, ఎమ్మెల్సీ దండే విఠల్.
Kagaznagar: కాగజ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో 5 డయాలసిస్ బెడ్లు ప్రారంభం!
కాగజ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో అదనంగా 5 డయాలసిస్ బెడ్ల ప్రారంభం
కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అదనంగా ఏర్పాటు చేసిన 5 డయాలసిస్ బెడ్లను సిర్పూర్ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ సంయుక్తంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు మెరుగైన చికిత్స కోసం ఇతర జిల్లాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్ని సౌకర్యాలను స్థానికంగానే అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు డయాలసిస్ అత్యవసర చికిత్స అని, ఇప్పటివరకు పరిమిత సంఖ్యలో బెడ్లు ఉండటంతో రోగులు వేచి ఉండాల్సి వచ్చేదని పేర్కొన్నారు. తాజాగా మరో 5 బెడ్లు అందుబాటులోకి రావడంతో ఎక్కువ మంది రోగులకు సమయానికి చికిత్స అందే అవకాశం ఉంటుందని, దీని వల్ల ముఖ్యంగా పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.




