Kagaznagar: బాలాజీ నగర్‌లో దొంగతనం కలకలం.. నిందితుడు అరెస్ట్!
Kagaznagar: కొమరంభీం జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని బాలాజీ నగర్‌లో వరుస ఆవుల దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని కాలనీ వాసులు పట్టుకున్నారు.
Kagaznagar: బాలాజీ నగర్‌లో దొంగతనం కలకలం.. నిందితుడు అరెస్ట్!
కగజనగర్: కొమరంభీం జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని బాలాజీ నగర్‌లో పశువుల దొంగతనం ఘటనలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. గత కొన్ని రోజులుగా వరుసగా ఆవులు కనిపించకుండా పోవడంతో అప్రమత్తమైన కాలనీ వాసులు… చివరకు అనుమానితుడిని పట్టుకున్నారు. రాజు పెట్రోల్ పంప్ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఆవులను తరలిస్తుండగా పట్టుకుని, ఆగ్రహంతో దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Next Story




