Komaram Bheem: వార్నీ.. ఇదెక్కడి దొంగతనం? ఆటో టైర్లు, లైట్లు మాయం!
Komaram Bheem: కాగజ్ నగర్ పట్టణంలో వింత దొంగతనం చోటుచేసుకుంది. కపువాడలో పార్క్ చేసిన ఆటో టైర్లు, లైట్లను దొంగలు ఎత్తుకెళ్లారు.
Komaram Bheem: వార్నీ.. ఇదెక్కడి దొంగతనం? ఆటో టైర్లు, లైట్లు మాయం!
కొమరం భీం జిల్లా: కాగజ్ నగర్ పట్టణంలోని కపువాడ భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో చోరీ ఘటన చోటుచేసుకుంది. కమ్మరి వారి ఇంటి ముందు నిలిపి ఉంచిన ఆటోకు చెందిన మూడు టైర్లు, లైట్లు రాత్రి సమయంలో గుర్తుతెలియని దొంగలు విప్పుకొని వెళ్లినట్లు సమాచారం. ఉదయం గమనించిన యజమాని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రాంతంలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Next Story




